యువరాణిలా చూసుకుంటా.. రూమర్స్ పై క్లారిటి ఇచ్చిన రాహుల్!

Friday, June 1st, 2018, 11:27:09 PM IST

మొదటి సారి పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచిన క్రికెటర్ కెఎల్.రాహుల్ మొత్తానికి వివరణ ఇచ్చాడు. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ తో బాంద్రాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ న్యూస్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెతో రాహుల్ ప్రేమలో ఉన్నట్లు దేశమంతటా న్యూస్ వైరల్ అయ్యింది. ఇకపోతే ముందే హీరోయిన్ నిధి తన వివరణ ఇచ్చింది. ఇక రీసెంట్ గా రాహుల్ కూడా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

తను నాకు ఒక మంచి స్నేహితురాలు. మేము కలుసుకోవడం ఇది మొదటి సారి కాదు. నేను క్రికెటర్ అవ్వకముందు.. అలాగే తాను హీరోయిన్ అవ్వకముందు నుంచే పరిచయం ఉంది. తాను హీరోయిన్ గా కొనసాగుతుండడం చాలా ఆనందంగా ఉంది. మొన్న మేమిద్దరమే కాకుండా పార్టీకి బెంగుళూరు నుంచి మరికొంత మంది స్నేహితులు కూడా వచ్చారని తమ మధ్య అందరూ అనుకుంటున్న విషయం లేదని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా తనకు కాబోయే భార్యను యువరాణిలా చూసుకుంటానని చెబుతూ.. ఒక మంచి అమ్మాయి దగ్గరైతే కచ్చితంగా ప్రపంచానికి తెలిసేల చేసుకుంటాను అని వివరణ ఇచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments