కోడలి నాని ఫైర్ – చంద్రబాబు కట్టప్ప ఒకటే

Friday, January 11th, 2019, 02:20:21 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు పైన వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోడలి నాని తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ దేశంలోనే అతిపెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు. అతన్నిమించిన అవినీతి పరుడు మనకి ఎక్కడ కూడా కనిపించడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ చంక నాలుగు సంవత్సరాలు నాకి ఇపుడు విమర్శలు చేస్తున్నారు. అతి పెద్ద నీటి మళ్ళిన రాజకీయ నాయకుడు అంటే ముందుగా చంద్రబాబు నాయుడు పేరే ముందు కనిప్పిస్తుంది అని నాని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న పరువు అంత తీసుకున్న చంద్రబాబు మల్లి ఏపీ లో కూడా అదేవిధంగా పరువు తీసుకుంటారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కి తగిన బుడ్డి చెబుతారని, ఇక టీడీపీ పార్టీ ఏపీ లో కనబడదని కోడలి నాని ఆరోపించారు.

అంతేకాకుండా జగన్ చేసిన పాదయాత్రలపై వచ్చిన మద్దతు చూసి చంద్రబాబు ఈర్షపడుతున్నాడని, జగన్ కి వచ్చిన మద్దతుని చెడగొడుతున్నాడని కోడలి నాని మండిపడ్డారు. జగన్ అధికారం లోకి రాకుండా చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడని నాని ఆరోపించాడు. కాగా చంద్రబాబు సిగ్గులేకుండా పవన్ కళ్యాణ్ తో కలవడానికి మొగ్గు చూపుతున్నాడు. రోజు తిట్టే పవన్ తో కలవడానికి సిగ్గు లేదా అని నాని ఆరోపించారు. చంద్రబాబు బాహుబలి సినిమాలో కట్టప్ప లాంటి వాడు. వెన్నుపోటు పొడవడంతో చందద్రబాబు ని మించిన వ్యక్తి మరొకడు దొరకడు.