వచ్చే ఎలక్షన్ లో మేమె కింగ్.. కింగ్ మేకర్ కాదు: కోదండరామ్

Wednesday, May 23rd, 2018, 04:44:48 PM IST

తెలంగాణాలో ప్రస్తుతం బలమైన పార్టీగా తెరాసా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో రానించడం లేదనే టాక్ వస్తోంది. వచ్చే ఎలక్షన్స్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పడం కష్టమే. ఇక తెలుగు దేశం పార్టీ చాలా వరకు చిన్నబోయింది. ఎక్కడా కూడా పెద్దగా రెస్పాన్స్ అందడం లేదు. అయితే కేసీఆర్ తో ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి ఇప్పుడు ఎలక్షన్స్ కోసం సిద్దమవ్వడం ఆసక్తిగా మారింది. తెలంగాణ జన సమితి అని ఆయన ఒక ప్రత్యేక పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికలో కేసీఆర్ కి పోటీని ఇవ్వడం ఖాయమని కోదండరాం నమ్మకంగా చెబుతున్నారు. కాంగ్రెస్ తన స్థానాలను గెలుచుకుంటే టీఆరెస్ ఎక్కువ స్థానాలను అందుకుంటుంది. ఈ క్రమంలో కోదండరాం పార్టీ ఓట్లను చీల్చి మరికొన్న స్థానాలను తన ఖాతాలో వేసుకోవడం వల్ల కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయంపై కోదండరాం స్పందించారు. మా పార్టీ అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుంది. పూర్తీ మెజారిటీ గెలుపుపై మాకు నమ్మకం ఉంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెయ్యికి పైగా దరఖాస్తులు అందినట్లు ఆయన తెలియజేశారు. అదే విధంగా పొత్తుల విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏ పార్టీతో వెళ్లకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెబుతూ.. ఫైనల్ గా ఎన్నికల్లో తమ పార్టీ కింగ్ మేకర్ కాదని కింగ్ అవుతామని కోదండరామ్ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments