కేసీఆర్‌కి మొగుడిలా త‌గిలాడు!

Tuesday, February 21st, 2017, 06:30:08 PM IST


ఈయ‌నేవ‌రండీ బాబూ? కేసీఆర్‌కే మొగుడిలా త‌గిలాడు. టీడీపీవోళ్లు చేయ‌లేంది? కాంగ్రెస్సోల్లు సాధించ‌లేనిది.. బీజేపీ, వామ‌ప‌క్షాలు పెక‌ల్చ‌లేనిది.. ఈయ‌న పెకిలించేట్టే ఉన్నాడు. అనుకున్న‌ది సాధించేట్టే క‌నిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తేరాస ప‌ని అయిపోయిన‌ట్టే. కేసీఆర్‌ని ఎదురొడ్డి గెలిచే మొన‌గాడు క‌నిపిస్తున్నాడు.. ప్ర‌స్తుతం ఇదీ తెలంగాణ వ్యాప్తంగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట‌! అస‌లింత‌కీ ఎవ‌రా మొన‌గాడు? అంటే కోదండ‌రామ్ అన్న ఒకే ఒక్క రైజింగ్ నేమ్ వినిపిస్తోంది.

తెలంగాణ ఏర్పాటు అయ్యాక ఇంటింటికి ఉద్యోగం అంటూ ప్ర‌క‌టించిన కేసీఆర్ ప్ర‌భుత్వం మాట తప్పింది. దీనిపై తెలంగాణ యువ‌త అంతా చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. ఉద్యోగం ఇస్తామ‌న్న స‌ర్కారు న‌త్త‌న‌డ‌క‌న నోటిఫికేష‌న్లు అంటూ ఊరిస్తోంది. కానీ ఇచ్చేందుకే ముందుకు రావ‌డం లేదు. వీళ్ల‌లో చిత్త‌శుద్ధి లేద‌ని యూత్ భావిస్తున్నారు. స‌రిగ్గా ఇదే పాయింటును ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ తెలివిగా ప‌ట్టేశారు. అందుకే నిరుద్యోగ ర్యాలీ పేరుతో ప్ర‌భుత్వానికి ఎదురెళుతున్నారు. నిరుద్యోగుల ర్యాలీ ఏకంగా ఉస్మానియా లాంటి చోట చేస్తే వ‌చ్చే స్పంద‌న వేరుగా ఉంటుంద‌ని భావించిన ఆయ‌న పోలీస్ ప‌ర్మిష‌న్ కోసం అప్ల‌య్ చేశారు. య‌థావిధిగానే కోదండ‌ను అణ‌చివేయాల‌న్న ప్ర‌భుత్వ కుట్ర మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. దీంతో ప్రొఫెస‌ర్ ఇమేజ్‌ని కేసీఆర్ మ‌రింత‌గా పెంచేస్తున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీనివ‌ల్ల కోదండ‌కు క్యాంపస్‌లో ఇమేజ్ రెట్టింపైంది. అత‌డు చేస్తున్న ప్ర‌జా ఉద్య‌మాల వ‌ల్ల మునుముందు అత‌డినే త‌మ‌నాయ‌కుడిగా, భ‌విష్య‌త్ సీఎంగా విద్యార్థులు ఊపించుకునే ఛాన్సుంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రోవైపు రైతుల త‌ర‌పున పోరాటం చేస్తూ హీరో అయిన కోదండ మునుముందు ఇంకెలాంటి ఉద్య‌మాలు చేప‌డ‌తారో చూడా