కేసీఆర్ 1000 కోట్ల ప్ర‌క‌ట‌న‌లు.. నిల‌దీసిన కోదండ‌!

Sunday, May 6th, 2018, 03:10:42 PM IST

సీఎం ఆఫీస్ నుంచి వ‌చ్చే ఫోన్ ప‌త్రిక‌ల్ని న‌డిపించ‌డం ఎంత దారుణం .. ఇలాంటి స‌న్నివేశం తెలంగాణ స‌హా తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నామ‌ని తీవ్రంగా విమ‌ర్శించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌. కేవ‌లం ప‌త్రిక‌ల్లో ప్ర‌చారం కోసం 1000 కోట్లు తెలంగాణ ప్ర‌భుత్వ ం ఖ‌ర్చు చేయ‌డం దారుణ‌మ‌ని విమ‌ర్శించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నూతనంగా మరొక పత్రిక రావడం చాలా సంతోషకరమైన విషయమని కోదండరామ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హోటల్ మారియట్‌లో విజయక్రాంతి దినపత్రిక ప్రారంభోత్సవంలో కోదండరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎడ్వర్‌టైజ్ మెంట్ల ద్వారా మీడియాపై ప్రభుత్వం నియంత్రణను తీసుకురావడం చాలా దారుణమని, ఈ త‌ర‌హా నియంత్రణను గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని విమ‌ర్శించారు.

మీడియాను నియంత్రించడం, పత్రికల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించుకుపోయిందని.. కొన్ని సందర్భాలలో పత్రికల ఎడిటర్‌లను మార్చిన ఘటనలను విన్నామని, చాలా సందర్భాల్లో సీఎం ఆఫీస్ నుంచి సందేశాలు రావడం వంటి విషయాలు విన్నామన్నారు. ఇట్లాంటి సందర్భాల్లో నిర్భయంగా, నిష్పక్షపాతంగా వాస్తవాలను చెప్పటానికి ఒక వేదికగా విజయక్రాంతి పత్రిక రావడం అనేది ఊరట కలిగించే విషయమని తెలిపారు. ఆయ‌న ప్ర‌సంగం దృష్ట్యా.. కోదండ‌కు విజ‌య‌క్రాంతి వెన్నుద‌న్నుగా నిలుస్తుంద‌నడంలో సందేహం లేదు. ఇక కేసీఆర్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని ఈ కొత్త తెలంగాణ‌ ప‌త్రిక తూర్పార‌బ‌ట్ట‌నుంది.

  •  
  •  
  •  
  •  

Comments