తెరాస పై ధ్వజమెత్తిన కోదండరాం…

Tuesday, November 6th, 2018, 05:34:09 PM IST

మహా కూటమిని విచ్చిన్నం చేయడానికి తెరాస ప్రయత్నిస్తుందని అనవసరంగా ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని, ఎన్నికలలో ఓడిపోతామన్న భయం తో ఏదేదో మాట్లాడుతున్నారని, ఇప్పుడు వారు చేసే ఆరోపణలు పిచ్చివాళ్ళని తలపిస్తున్నాయని తెలంగాణా జన సమితి అధినేత కోదండరాం ఒక ప్రకటనలో తెలిపారు. మహా కూటమి లో సీట్ల సర్దుబాటు విషయం పై కూడా స్పందించారు. మాకు గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు ఉన్నారని, పొత్తులు ఖరారయ్యాక అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. పొత్తులపై తాము సానుకూలంగానే ఉన్నామని, పొత్తులపై జాప్యం కారణంగా ప్రజా సంఘాల్లో కొంత నీరుత్సాహం కనిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల గుర్తు ఖరారయ్యింది, మేనిఫెస్టో కుడా ఫైనల్ అయ్యిందని, ఎన్నికల కమిషన్ అప్రూవల్ రాగానే మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.దసరా కి రావాల్సిన కూటమి ఇప్పటికి కూడా రాకపోవడం అంత రాజకీయ అవసరాల కోసం కూటమి కాదని, ప్రత్యామ్నాయ మార్గమని చెప్పారు. త్వరగా ప్రజలలోకి వెళ్తే ప్రజా ఉప్పెన కదలి వస్తుందన్నారు. కూటమిని విచ్ఛిన్నం చేయడానికి తెరాస కుట్ర చేస్తోందన్నారు. సీపీఐ సమస్యను కూడా మా సమస్యగా చూస్తామని చెప్పారు. సీపీఐ కూడా కూటమిలా ఉండాలన్నారు. సీపీఐ బయటకు వెళ్లిపోతే కూటమికి చాలా నష్టమని చెప్పారు. నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలనుకునే వాళ్లు తమతో కలిసి రావాలని చెప్పారు. కూటమికి సహకరించాలన్నారు. చివరికి గెలుపుని ఆస్వాదిస్తామన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments