బెట్టు వీడ‌ని కోదండ‌రామ్‌ !

Wednesday, October 31st, 2018, 09:55:22 AM IST

మ‌హాకూట‌మిలో సీట్ల ఆట ఇంకా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. కోదండ‌రామ్ నేతృత్వం వ‌హిస్తున్న తెలంగాణ జ‌న‌స‌మితి సీట్ల విష‌యంలో పీట‌ముడి వీడ‌క పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. తెజ‌స 12 సీట్లు ఆశిస్తోంది. అయితే కాంగ్రెస్‌, టీడీపీ మాత్రం అన్ని ఇవ్వ‌డ‌మే ఎక్కువ అన్న ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇది తెజ‌స శ్రేణుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ‌గుండం, వ‌రంగ‌ల్ తూర్పు, మ‌ల్కాజిగిరి, మిర్యాల‌గూడ‌, అశ్వారావుపేట‌, సిద్ధిపేట‌, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌ల‌క్‌పేట నియోజ‌క వ‌ర్గాలను కేటాయిస్తూ కాంగ్రెస్ తెజ‌స‌కు ప‌చ్చ‌జెండా ఊపేసింద‌ట‌. కానీ ఇవి స‌రిపోవ‌ని మ‌రో నాలుగు సీట్లు ఇవ్వాల్సిందేన‌ని కోదండ‌రామ్ ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు తెలిసింది.

త‌మ కేటాయించిన ఎన‌మిది స్థానాల‌తో పాటు చెన్నూరు, అసిఫాబాద్‌, దుబ్బాక‌, షాద్‌న‌గ‌ర్ లేదా మెద‌క్ స్థానాల్ని కేటాయించాల‌ని తెజ‌స తాజా ప్ర‌తిపాద‌న పెట్టిందిట‌. దీనిపై రెండు రోజుల్లో తేల్చ‌కుంటే త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని, ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని కాంగ్రెస్ వ‌ర్గాల‌కు అల్ట‌మేట‌మ్ జారీచేసిన‌ట్లు తాజా స‌మాచారం. బ‌లంగా కోరుతున్న నాలుగు స్థానాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల్ని రంగంలోకి దింపాల‌నేది తెజ‌స ప్యూహంగా చెబుతున్నారు.

పొత్తు కుదుర్చుకునేంత వ‌ర‌కు సానుకూలంగా వ్య‌వ‌హ‌రించిన ఉత్త‌మ్ ఆ త‌రువాత నుంచి తెజ‌స‌తో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం…సీట్ల పంప‌కాల విష‌యంలోనూ అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం కూడా తెజ‌స వ‌ర్గాల్లో అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. ఉత్త‌మ్ వైఖ‌రిపై కొంత మంది తెజ‌స నాయ‌కులు కోదండ‌రామ్‌తో వివ‌రించార‌ని, రెండు రోజుల్లో కోరిన సీట్ల లెక్క తేల‌ని ప‌క్షంలో తెజ‌స ఒంట‌రిగానే పోటీకి దిగాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశాలే ఎక్కువ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments