టీఆరెస్ కి పోటీగా కోదండరామ్ కొత్త పార్టీ !

Monday, February 5th, 2018, 10:53:03 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై గత కొంత కాలంగా టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్ విమర్శలు చేస్తోన్న కోదండరామ్ ఎట్టకేలకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమయ్యారు. చాలా కాలంగా టీఆరెస్ పాలనపై ఆయన అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగ సమస్యలపై ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతే కాకుండా ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ధర్నాలకు కూడా వెళ్లారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.

అంతే కాకుండా టీడీపీ వైపు కూడా వెళుతున్నట్లు కామెంట్స్ వినిపించాయి. కానీ కోదండరామ్ ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇక ఆయనే ఒక పార్టీ పెట్టాలనే ఆలోచనలో స్థిరంగా ఉన్నారు. 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పై జరిగిన మిలియన్ మార్చ్ కి గుర్తుగా, వచ్చే నెల మార్చి 10న వరంగల్ లో కొత్త పార్టీ ఆవిర్భావ సభను అయన నిర్వహించనున్నట్టు ఇదివరకే చెప్పారు. అయితే పార్టీ పేరు ఇదేనంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ జన సమితి’ అని పేరును సెట్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ గుర్తుగా ‘రైతు-నాగలి’ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రిజిస్ట్రేషన్ కు సంబంచిన పనులను ముగించుకొని పార్టీ వ్యవహారాలను త్వరలో తెలియజేస్తారని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments