కేసీఆర్ ఖేల్ ఖ‌తం…దూసుకొస్తున్న‌ కోదండ బాంబ్‌!!

Thursday, January 19th, 2017, 03:45:45 AM IST

kodandaram
ప్ర‌స్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు. టార్గెట్ -2019 ఎల‌క్ష‌న్స్ అన్న‌ది కేసీఆర్ నినాదం. అందుకోసం ఆయ‌న త‌న‌దైన రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు అన్న‌వే త‌న‌ముందు నిల‌వ‌కుండా పీక నులిమేసిన కేసీఆర్ ఎదురే లేనివాడిగా దూసుకుపోతున్నారు. అయితే స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశంలోనే కేసీఆర్ మెడ‌కు కోదండ‌రామ్ అనే గుదిబండ త‌గులుకుంది. ఇది వ‌ద‌ల‌దు.. వెళ్ల‌నివ్వ‌దు.. అన్న చందంగా సీఎం ప‌రిస్థితి అయోమ‌యంలో ఉందిప్పుడు.

నిజాయితీ, చిత్త‌శుద్ధి, ప్ర‌జా సేవ‌లో ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ ఆకాశం ఎత్తు. అందుకే ఆయ‌న‌కు జ‌నాల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం చేప‌ట్టే దేన్న‌యినా ఆయ‌న వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌జ‌ల వైపు నిలుస్తున్నారు. స‌రిగ్గా ఇదే ఆయ‌న్ని తెలంగాణ‌లో హీరోని చేస్తోంది. ఇప్పుడు కోదండ‌రామ్‌కి జాతీయ కాంగ్రెస్ అండాదండా ఉన్నాయి కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున కోదండ‌రామ్ రాజ‌కీయ‌పార్టీ పెట్టి పోటీ చేస్తార‌న్న వాద‌న ఉంది. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ఏకైక తెలంగాణ‌ పార్టీగా కోదండ‌రామ్ పార్టీ నిలుస్తుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు విశ్లేషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ ఖేల్ ఖ‌తం… దుకాణ్ బంద్ అని అర్థం చేసుకోవాల్సొస్తోంది. ఇంకా చెప్పాలంటే అవిభాజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబుకు ఎస‌రు పెట్టి పుట్టి ముంచిన కేసీఆర్‌ని త‌ల‌పిస్తున్నారు కోదండ‌… అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే సీరియ‌స్‌నెస్ అర్థం చేసుకోవ‌చ్చు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ప్ప మిగ‌తా అన్ని పార్టీలు కోదండ కు స‌పోర్టుగా నిలుస్తున్నాయి. అదీ సంగ‌తి.