రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నేతలు.. టీడీపీ లేనట్లే ?

Sunday, October 22nd, 2017, 03:50:54 AM IST

ఒకప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ తర్వాత తెలుగు దేశం పార్టీ హవానే ఎక్కువగా నడిచేది. టీడీపీ లోకల్ లీడర్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ జిల్లాలలో నాయకులతో కార్యకర్తలతో తరచు భేటీ అవుతూ.. పార్టీని ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉండేవారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు అన్ని మారిపోయాయి. కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలన్నీ చెల్లా చెదురయ్యాయి. గెలిచినా నాయకులు కూడా టీఆరెస్ లోకి వెళ్లిపోయారు.

టిడిపిలో చాలా వరకు టీఆరెస్ లోకి వెళ్లిపోవడంతో పార్టీలో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే మిగిలిపోయాడు. అయన ఎంత పోరాడినా లాభం లేకపోతోంది. అయితే తెలంగాణాలో దాదాపు టీడీపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డికి మరొక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త‌న సొంత నియోజ‌క వ‌ర్గంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కార్య‌క‌ర్త‌లు ఇతర నేతలు టీఆరెస్ లోకి చేరారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్ లో వారు తెలంగాణ మంత్రులు ఈటల రాజేంద‌ర్‌, జూప‌ల్లి కృష్ణారావు స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో కొడంగల్ నాయ‌క‌త్వం అంతా త‌మ పార్టీలో చేరింద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలుపుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి అందరు టీఆరెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా వారు తెలియజేశారు.