కోహ్లీ సెంచరీ చేయగానే గ్రౌండ్ లోకి దూకిన ఫ్యాన్

Monday, October 30th, 2017, 08:46:54 AM IST

కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు మరో వన్డే సిరీస్ ను గెలిచింది. న్యూజిలాండ్ తో 2-1 తో సిరీస్ ను గెలిచి వరుసగా ఏడవ సిరీస్ ని గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ రోహిత్ స్ట్రాంగ్ బ్యాటింగ్ తో మ్యాచ్ ను గెలిపించారు. దీంతో క్రికెట్ దిగ్గజాల నుండి దేశ అభిమానుల నుండి భారత క్రికెటర్లకు ప్రశంసలు అందుతున్నాయి. వరుస విజయాలతో ఏ మాత్రం తడబడకుండా సిరీస్ లను దక్కించుకుంటున్నారు. అయితే నిన్న జరిగిన కాన్పూర్ వన్డేలో ఎవరు ఊహించని సంఘటన ఎదురైంది. కోహ్లీ సెంచరీ బాధగానే స్టేడియం మొత్తం ఈలలతో చప్పట్లతో మారు మ్రోగిపోయింది. కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీని ధరించిన ఒక అభిమాని సడన్ గా గ్రౌండ్ లోకి దూకాడు. కోహ్లీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుండడంతో అంపైర్ అతన్ని ఆప్ ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత స్టేడియం సిబ్బంది అతన్ని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

  •  
  •  
  •  
  •  

Comments