మూడో టెస్టు వేటు నుంచి తప్పించుకున్న కోహ్లీ !

Tuesday, January 16th, 2018, 06:18:47 PM IST

విరాట్ కోహ్లీకి క్రమశిక్షణ రాహిత్యం కింద బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. సౌత్ ఆఫ్రికా రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీ బంతిని నేలకేసి కొట్టి తన అసహనాని వ్యక్తం చేశాడు. టీం ఇండియా కెప్టెన్ కు అంత కోపం ఎందుకు వచ్చిందో వివరాల్లో తెలుసుకుందాం..

సౌత్ ఆఫ్రికాగా ప్రస్తుతం రెండవ ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. సఫారీలో ప్రస్తుతం 233 పరుగుల లీడ్ లో ఉన్నారు. ఇది నాల్గవ రోజు. ఇంకా చివరి రోజు ఆట మిగిలిఉన్న నేపథ్యంలో రెండవ టెస్టు రసవత్తరంగా మారుతోంది. సఫారీలు టీం ఇండియా బౌలర్లని సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నారు. కాగా ఇన్నింగ్స్ మధ్యలో అవుట్ ఫీల్డ్ బాగోలేదంటూ కోహ్లీ అంపైర్లకు పదేపదే ఫిర్యాదు చేశాడు. కానీ కోహ్లీ అభ్యర్థనిని అంపైర్లు పట్టించుకోలేదు. దీనితో కోహ్లీ తీవ్ర అసహనానికి లోనై బంతిని నేలకేసి కొట్టాడు. ఇంకేముంది మ్యాచ్ రిఫరీ కోహ్లీ ఫీజులో 25 శాతం కోత విధించాడు. ఐసీసీ కోహ్లీని ఈ ఘటన పై వివరణ అడగగా తప్పు తనదే అని అగీకరించాడట. దీనితో 25 శాతం ఫీజు కోతతో సరిపోయింది. లేకుంటే కోహ్లీపై తరువాతి మ్యాచ్ కు వేటు పడేదే.