కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ చేస్తే కాసుల వర్షమే

Wednesday, November 8th, 2017, 10:47:59 AM IST

ప్రస్తుతం ఇండియాలో క్రికెట్ ఆటకు ఎంత ఆధారణ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్లేయర్స్ అయితే సినీ తరలకంటే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా మంది అభిమానులను సంపాదించుకుంటున్నారు. దీంతో వారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని బడా కంపెనీలు ప్రమోషన్స్ కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఆటగాళ్లు కొన్ని కంపెనీలకు ప్రచార కర్తలుగా ఉంటూ.. బాగానే సంపాదిస్తున్నారు.
ముఖ్యంగా ప్రస్తుత జట్టు సారధి విరాట్ కోహ్లీ అందరికంటే టాప్ లో ఉన్నాడని చెప్పాలి.

ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల కంపెనీలు కూడా కోహ్లీతో ప్రచారాన్ని చేయిస్తున్నాయి. ఇప్పటికే ప్యూమా – ఎంఆర్‌ఎఫ్‌ సంస్థలు వందల కోట్ల రూపాయలతో కోహ్లీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తన మార్కెటింగ్ తో మొన్నటి వరకు టాప్ లో ఉన్న ఫుట్ బల్ ప్లేయర్ లియోనల్‌ మెస్సీని కూడా కోహ్లీ దాటేశాడు. ఒక్క రోజు ప్రచారం నిర్వహిస్తే కోహ్లీ 2.5 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా మనోడి హవా బాగానే ఉంది. ఒక్క ఇన్స్టాగ్రామ్ లోనే 16.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో కొన్ని బడా కంపెనీలు సోషల్ మీడియా ద్వారా కూడా కోహ్లీతో ప్రచారాన్ని చేయిస్తున్నాయి. బ్రాండ్ గురించి కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే చాలు రూ.3.2 కోట్ల వరకు అందుకుంటున్నాడు. ఇక కోహ్లీ తనకు ఇష్టం లేని వాటి గురించి అంతగా ప్రచారాన్ని నిర్వహించడం లేదు. ముఖ్యంగా పెప్సీ కంపెనీ పెద్ద మొత్తంలో అఫర్ చేసినా కూడా కోహ్లీ ఒప్పుకోలేదు.

  •  
  •  
  •  
  •  

Comments