మేము ఓడిపోయాము అనడమే కరెక్ట్ : కోహ్లీ

Tuesday, May 8th, 2018, 05:38:12 PM IST

ఐపీఎల్ 11వ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు దాదాపు అన్ని జట్లు ఈ సారి స్ట్రాంగ్ గా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు బాగానే చెప్పారు. కానీ సగం మ్యాచ్ లు అయిపోయే సరికి స్ట్రాంగ్ అనుకున్న జట్లన్నీ ఒక్కసారిగా ఓటములతో సతమతమయ్యాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అయితే ఊహించని విధంగా ఓటములను చూడాల్సి వచ్చింది. సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా ఇండియా జట్టుకు సేవలందిస్తున్న విరాట్ ఐపీఎల్ లో మాత్రం ఆ తరహాలో జట్టును గెలిపించలేకపోతున్నాడు.

ఐపీఎల్ లో పోటీ కూడా చాలా గట్టిగా నడుస్తోంది. హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ మంచి విజయాలతో దూసుకుపోతోంది. సోమవారం జరిగిన మ్యాచ్ పై విరాట్ స్పందిస్తూ.. సన్ రైజర్స్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాము అంటే నిజంగా ఆ జట్టు ఎంత స్ట్రాంగ్ గా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం మేము విజయానికి అనర్హులం. హైదరాబాద్ టీమ్ చాలా బాగా ఆడింది. వారు గెలిచారు అనడం కన్నా మేము ఓడిపోయాము అనటమే అని విరాట్ వివరించాడు. ఇక హైదరాబాద్ మ్యాచ్ పరాజయంతో ఆర్సీబీ ఆడిన 10 మ్యాచ్ లలో ఏడవ పరాజయానిక్ మూటగట్టుకుంది. దీంతో దాదాపు ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లే మరో వైపు హైదరాబాద్ మాత్రం ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.