ఖేల్ రత్న అవార్డు జాబితాలో రన్ మెషిన్ కోహ్లీ..!

Monday, September 17th, 2018, 07:00:08 PM IST

ప్రస్తుత భారత జట్టు సారధి తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో ఎన్నో ఎన్నో విజయాలను భారత జట్టుకి అందించిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు మరో అరుదైన పురస్కారం దక్కబోతున్నట్లు తెలుస్తుంది. భారత క్రీడాకారులకు ఇచ్చే అవార్డు “ఖేల్ రత్న”. ఐతే ఇది వరకే కోహ్లీ పేరును ప్రతిపాదించినా అప్పుడు కొన్ని అనివార్య కారణాల వలన అపుడు కోహ్లీ పేరుని తొలగించాల్సి వచ్చింది. కానీ మళ్ళీ ఈ సారి ఈ నెంబర్ వన్ బ్యాట్సమెన్ పేరు మళ్ళీ ఈ జాబితాలోకి వచ్చింది.

కేంద్ర క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ కోహ్లీ పేరుని ఆమోదించినట్టు ఐతే కోహ్లీ కి ఈ అరుదైన పురస్కారం దక్కుతుంది.
ఒకవేళ ఈ అవార్డు కానీ కోహ్లీ దక్కించుకుంటే ఖేల్ రత్నా అవార్డు గెలుచుకున్న మూడవ క్రికెటర్ అవుతాడు. ఈ అవార్డును ఇంతక ముందు క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ 1997 లోను, మిస్టర్ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 2007 లోను దక్కించుకున్నారు.