కోహ్లీ నిలబెట్టాడు..బుమ్రా దెబ్బ కొట్టాడు..!

Monday, January 15th, 2018, 06:24:35 PM IST

మరో మారు టీం ఇండియా కెప్టెన్ ఒంటరి పోరాటం చేశాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సౌత్ ఆఫ్రికాకు టీం ఇండియా గట్టి పోటీ నిచ్చే స్థితిలో నిలబెట్టాడు. సఫారీల పేస్ బౌలర్లు విసురుతున్న నిప్పుల్లాంటి బంతులని ఎదుర్కొన్న కోహ్లీ 2017 బంతుల్లో 15 ఫోన్ల సాయంతో 153 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లని వారి గడ్డపై ఎదుర్కొనడం అంత సులువు కాదు. పైగా సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుతున్నా సమయం లో కోహ్లీ ఆడిన ఆట చిరస్మరణీయం అని చెప్పాలి. టెయిలెండర్లలో అశ్విన్ 38 పరుగులతో కోహ్లీకి సహకారం అందించాడు. లేకుంటే టీంఇండియా ఇంకా కష్టాల్లోకి వెళ్ళేది. మొత్తంగా తొలిఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా జట్టు 335 పరుగులు సాధించింది. భారత జట్టు ఆధిక్యం లోకి వెళ్లకున్నా వారికి ధీటుగా 307 పరుగులు సాధించడం విశేషం. మరో బ్యాట్స్ మాన్ కోహ్లీకి సహకారం అందించి ఉంటె మంచి ఆధిక్యం సాధ్యమయ్యేదే. కాగా భారత జట్టు ఆల్ అవుట్ ఐన వెంటనే సఫారీలు రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

యువఫేసర్ బుమ్రా ఆరంభంలోనే సఫారీలని గట్టి దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ లారెండవ ఓవర్ లో బుమ్రా సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మార్క్ రామ్ ని పెవిలియన్ బాట పట్టించాడు. ఆరవ ఓవర్ లో హషిమ్ ఆమ్లా ని బోల్తా కొట్టించాడు. కాగా సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో సఫారీలని తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తే టీం ఇండియా కు సిరీస్ ని సమం చేయడానికి మంచి అవకాశం దక్కినట్లే.