ఉసేన్ బోల్ట్ వేగం అందుకుంటానన్న కోహ్లీ..!

Tuesday, February 21st, 2017, 01:26:36 AM IST


జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ ట్విట్టర్ వేదికగా కోహ్లీకి అభినందనలు తెలిపాడు. ప్రముఖ సంస్థ ప్యూమా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేదుకు 8 ఏళ్ల కాలానికి కోహ్లీ ఆ సంస్థతో రూ 110 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్నాడు. కాగా ఉసేన్ బోల్ట్ కూడా ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.ఈ సందర్భగా ఉసేన్ బోల్ట్ కోహ్లీని అభినందించాడు. మరింత ఎత్తుకు ఎదగడానికి కోహ్లీకి ఇది గొప్ప అవకాశం అని ట్వీట్ చేశాడు.

దీనికి కోహ్లి కుడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. ఎదో ఒక రోజు నీ అంత వేగంగా పరుగెత్తుతానని అనుకుంటున్నా.. థాంక్స్ లెజెండ్ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ఇటీవల కోహ్లీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోతోంది.గతంలో సచిన్, ధోనీ 100 కోట్ల పైన పలు ఒప్పందాలు చేసుకున్నా అవి వివిధ సంస్థకు చెందినవి. కానీ ఒకే సంస్థ తో రూ 110 కోట్ల డీల్ కుదుర్చుకోవడం భారత క్రీడా చరిత్రలోనే రికార్డ్. అంతర్జాతీయ క్రీడాకారులుగా ఉన్న ఉసేన్ బోల్ట్, అసఫా పావెల్, ధియేరి హేన్రి లు ప్యూమా కు ప్రచారకులుగా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ వారి జాబితాలో చేరడం విశేషం.