తొలిసారి సర్ గార్ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీని దక్కించుకున్న కోహ్లీ !

Thursday, January 18th, 2018, 03:11:44 PM IST

ఇండియన్ స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గౌరవం దక్కించుకున్నారు. 2017 వ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ లో టెస్ట్, వన్డే, టి20 ల లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సర్ గార్ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీని దక్కించుకున్నారు. గత ఏడాది ఈ ట్రోఫీని ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఐసీసీ ప్లేయర్ అఫ్ ది ఇయర్ అవార్డు కూడా కోహ్లీ అందుకున్నారు. అయితే ఈ అవార్డు రావడం కోహ్లీ కి ఇది రెండవ సారి. ఆయన ఇదివరకు 2012 లో కూడా ఈ అవార్డు పొందారు. 2017 కు గాను మొత్తం మూడు ఫార్మాట్ ఆటలలో కోహ్లీ తనదైన శైలిలో చెలరేగి ఆడి మంచి సగటు నమోదు చేసారు. మూడు ఫార్మాట్ లలో మొత్తంగా ఆరు సెంచరీలు చేసిన ఆయన 76.84 సగటు సాధించాడు. యువ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ ఐసీసీ పెరఫార్మెర్ అఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. బెంగుళూరు లో గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన టి20 లో చాహల్ 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన విషం మనకు తెలిసిందే. ఆఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. అలానే ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐసీసీ టెస్ట్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. పాక్ ఆటగాడు హాసన్ అలీ ఎమర్జింగ్ క్రికెటర్ అఫ్ ది ఇయర్ గాను, దక్షిణాఫ్రికా కు చెందిన మారియిస్ ఎరాస్మస్ ఐసీసీ ఎంపైర్ అఫ్ ది ఇయర్ గాను అవార్డు గెలుచుకున్నారు. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ క్రికెట్ జట్టు కు కోహ్లీ కెప్టెన్ గా ఎంపికయ్యారు. జట్టులో చతేశ్వర్ పుజారా, అశ్విన్ లకు చోటు దక్కింది. వన్డే జట్టుకు కూడా కోహ్లీని కెప్టెన్ గా ప్రకటించారు, తుది వన్డే జట్టులో జస్ప్రీత్ బుమ్రా కు చోటు లభించింది…