కుప్పకూలిన కోల్ కతా పురాతన బ్రిడ్జ్!

Wednesday, September 5th, 2018, 12:25:32 AM IST

పశ్చిమ బెంగాల్ రాజధాని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పురాతనమైన మజర్ హట్ వంతెన రైల్వే ట్రాక్ పై ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలింది. బ్రిడ్జ్ పై పలు వాహనాలు వెళుతుండగానే ఈ విపత్తు ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పలు కార్లు వాహనాలు ఇంకా కూలిన బబ్రిడ్జ్ పైనే ఉన్నాయి. ఇకపోతే శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ విచారణకు ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments