కేసీఆర్ పై ఇంత ఘాటు వ్యాఖ్యలా..?

Thursday, February 8th, 2018, 02:00:20 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. టిఆర్ఎస్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని తొక్కెస్తుందని, తన అనుచరుడు నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ మృతి వెనుక కొందరు టిఆర్ఎస్ నేతలు వున్నారని, ఒక పధకం ప్రకారమే శ్రీనివాస్ ని హత్య చేశారని నిరసిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హత్యకేసు లో కాల్ డేటా టైప్ చేసుకొచ్చామని మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదన్నారు. అంతేకాదు కాల్ డేటాపై ఆయనకు ఎంత అవగాహనా రాహిత్యం ఉందొ ఆ మాటల్లో తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబంలో మనస్పర్ధలున్నాయని, గతంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు అల్లుడు ఫోబియా తెగపట్టుకుందని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని భయపడుతున్నట్లున్నారన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ పదవి లాగేసుకున్నట్లుగా తన కుటుంబం నుండి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయం ఆయన్ను వెంటాడుతోందని అన్నారు. కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు నుంచి కేసీఆర్ కు పదవీ గండం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే కేసీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన నేత హరీష్ రావు మాత్రమేనని, కేసీఆర్ మాదిరిగానే హరీష్ రావు కి కూడా అన్నివర్గాల్లోనూ మంచి గుర్తింపు, పేరు ఉందని పైగా ఎమ్మెల్యేలందరికి ఆయనంటే కాస్త మాక్కువ ఎక్కువన్నారు. అందుకే కేసీఆర్ తన జాగ్రత్తల్లో తానుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పడు అదే తరహా వ్యాఖ్యలు ఎమ్మెల్యే కోమటి రెడ్డి చేయడం మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ వ్యవహారం తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ కి జనం లో మంచి గుర్తింపు లో ఉందంటే దానికి కారణం మంత్రి హరీష్ రావేనని గుర్తు చేశారు. కెసిఆర్ కుటుంబం లో కలతలు ఆయన్ను కుదిపేస్తున్నాయని, నిజంగా మనస్పర్ధలు ఉండడం వల్లనే ఆ మధ్య హరీష్ రావు ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు కేటీఆర్ హాజరు కాలేదన్నారు.

అదే సమయంలో కేటీఆర్ సినిమా చూసేందుకు బెంగళూరు వెళ్లారని ఆరోపించారు. నిజానికి కేసీఆర్ లేకపోతే వారిద్దరూ ఆధిపత్యం కోసం ఎప్పుడో రోడెక్కి కొట్టుకునే వారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలు మాట్లాడాలని, తాము చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజముంది కాబట్టే ఆయన మౌనంగా వున్నారని అన్నారు….