హై కోర్టులో కోమటిరెడ్డికి ఊరట.. వారికీ జరిమానా!

Friday, April 27th, 2018, 03:10:08 PM IST

సీనియర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హత గురించి గత కొంత కాలంగా హైకోర్టులో కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది. అంతే కాకుండా ఆయనపై ఆరోపణలు చేసి పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి జరిమానా విధించింది. మూడేళ్ల క్రితం కోమటిరెడ్డికి విద్యార్హత లేదంటూ.. కంచర్ల భూపాల్‌రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డిలు అప్పట్లో హై కోర్టులో వ్యాజ్యం వేశారు.

ఎన్నికల సమయంలో విద్యార్హత విషయంలో తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారని అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ నరసింహారెడ్డి, భూపాల్‌రెడ్డిలు ఆందోళన చేసి ఎమ్మెల్యే బీఈ పాస్‌ కాకుండానే ఉత్తీర్ణులైనట్లుగా చెప్పడంతో కోర్టును ఆశ్రయించగా ఈ వివాదం మూడేళ్ల తరువాత ఓ కొలిక్కి వచ్చింది. ఈ శుక్రవార కేసును చేపట్టిన న్యాయ స్థానం కేసును కొట్టేసింది. మూడేళ్లుగా కోర్టు సమయాన్ని అనసరంగా వృధా చేశారని కోర్టు నరసింహారెడ్డి, భూపాల్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే వారికి 25 వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.

  •  
  •  
  •  
  •  

Comments