కేసీఆర్ బుల్లెట్ కంటే నా గుండె గొప్పది: కోమటిరెడ్డి

Wednesday, March 21st, 2018, 12:03:48 PM IST

సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల శాసన సభలో అనుకొని పరిణామాలని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన దూకుడు కారణంగా శాసనసభ్యత్వం కోల్పోయి కాంగ్రెస్ ను మరింత కష్టాల్లోకి నెట్టేశారు అనే కామెంట్స్ వస్తున్నాయి. టీఆరెస్ కావాలనే తమపై అనవసర ఆరోపణలను చేసిందని ఆయనతో పాటు పపలువురు కాగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. ఇక గన్ మెన్లను సైతం తొలగించడంతో కోమటి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను సీఎం కేసీఆర్ చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతూ.. గన్ మెన్లను అందుకే తొలగించారని తెలిపారు. ఇక తనకు ఎలాంటి అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అనేలా తాను చెప్పానని, పిరికిపందను కాను అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కేసీఆర్ బుల్లెట్ కంటే నా గుండె గట్టిదని డైలాగ్ వదిలారు. ఇక నేడు మూడు గంటల సమయంలో శాసనసభ్యత్వం కోల్పోయిన విషయం గురించి కోమటిరెడ్డి ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ లో చర్చించనున్నారు.