టీఆరెస్ లో అతనొక్కడే కష్టపడతాడు: కాంగ్రస్ నేత

Wednesday, February 7th, 2018, 01:05:43 AM IST

తెలంగాణా రాష్ట్రంలో అసలు రాజకీయ వివాదాలు ఇప్పటి నుంచి మొదలవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట నిజమే అవుతోంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార పార్టీపై ప్రతి పక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. అంతే కాకుండా ఎవరు ఊహించని విధంగా సవాళ్లను కూడా విసురుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికార టీఆరెస్ పై కొత్తగా విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టీఆరెస్ నేతలపై కొత్తగా విమర్శలు చేస్తున్నాడు. టీఆరెస్ పార్టీలో నేతలమధ్య విభేదాలున్నాయని ముఖ్యంగా హరీష్ రావ్ – కేటీఆర్ మధ్యన గొడవలు కూడా జరిగాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోమటి రెట్టి మీడియాతో మాట్లాడుతూ..టీఆరెస్ కి వచ్చే ఎలక్షన్ లో నాలుగు ఓట్లు పడతాయి అంటే కేవలం హరీష్ రావ్ వల్లే. ఆయన ఒక్కడే అందులో చాలా వరకు కష్టపడే వ్యక్తి. ఆయనకు కేటీఆర్ కు అస్సలు పడదు. హరీష్ ఇంట్లో ఫంక్షన్ ఉంటే కేటీఆర్ కావాలనే వెళ్లలేదు. బెంగుళూరు లో సినిమా చూసి వచ్చాడు. కేసీఆర్ ఉన్నంత వరకే వారు బాగుంటారు. లేకుంటే వారి మధ్య వార్ ఎక్కువవ్వడం కాయమని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి జగదీశ్ రెడ్డిపై గురించి మాట్లాడుతూ.. ఆరు నెలల తరువాత అతనికి అడ్రస్ ఉండదని పలు రకాల కేసులు ఆయనపై ఉన్నాయని ఆరోపణలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments