కోమ‌టిరెడ్డి కొత్త డిమాండ్ ప‌స‌క్‌

Friday, November 9th, 2018, 06:26:40 PM IST

సీట్ల లెక్క తేలితే విభేదాలు జోరందుకుంటాయ‌ని కాంగ్రెస్ పెద్ద‌లు ఊహించి నామినేష‌న్ల ప‌ర్వం వ‌ర‌కు దాన్ని లాగారు. అయితే ఇప్ప‌డదే కాంగ్రెస్ కొంప కొల్లేరు చేసేలా వుంది. గ‌త కొన్ని రోజులుగా సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూ వ‌చ్చిన కాంగ్రెస్ రేప‌టితో తుది లెక్క‌ను తేల్చ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కొత్త వివాదానికి తెర‌తీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తెజ‌స వ‌ల్ల త‌ల‌బొప్పిక‌ట్టిన కాంగ్రెస్‌కు తాజా వివాదం మ‌రింత క‌ల‌వ‌రాన్ని క‌లిగిస్తోంది. తాజాగా న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌కిరేక‌ల్ సీటును మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ‌య్య‌కు ఇవ్వాల్సిందే అంటూ ప‌ట్ట‌బ‌ట్ట‌డం వివాదినికి కార‌ణంగా మారింది. ఈ సంద‌ర్భంగా న‌ల్ల‌గొండ‌లో లింగ‌య్య మ‌ద్ద‌తుదారుల‌తో కోమ‌టిరెట్టి వెంక‌ట‌రెడ్డి రాస్తా రోకోను న‌ర్వ‌హించ‌డం కాంగ్రెస్‌లో కొత్త వివాదానిక బీజం వేస్తోంది.

చిరుమ‌ర్తి లింగ‌య్య‌కు సీటు కేటాయించ‌ని ప‌క్షంలో తాను కూడా పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని కాంగ్రెస్ అదిష్టానానికి వెంక‌ట‌రెడ్డి అల్టిమేట‌మ్ జారీ చేశాడు. కాంగ్రెస్‌కు కీల‌కంగా మారిన న‌ల్ల‌గొండ నుంచే అస‌మ్మ‌తి రాగం విప్ప‌డం సంక‌టంగా మారింద‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే కూట‌మి పొత్త‌లో భాగంగా ఆ సీటును త‌మ‌కే ప్ర‌క‌టించాల‌ని టీటీడీపీ ప‌ట్టుబ‌డుతోంది. ఇక్క‌డి నుంచి టీడీపీ త‌రుపున పాల్వాయి ర‌జ‌నీకుమార్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇదే స్థానాన్ని త‌మ‌కు కేటాయించాల‌ని తెలంగాణ ఇంటిపార్టీ అధినేత చెరుకు సుధాక‌ర్ ప‌ట్టుబ‌డుతుండ‌టం న‌కిరేక‌ల్ రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది.

  •  
  •  
  •  
  •  

Comments