రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ: కాంగ్రెస్ నేత

Friday, February 9th, 2018, 03:02:03 AM IST

ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ ప్యాకేజి గురించి నేతలు ఓ రేంజ్ లో పోట్లాడుతున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రతి పక్షపార్టీ కాంగ్రెస్ ఎప్పటిలానే అధికార పార్టీపై కౌంటర్లు వేస్తోంది. ఈ మధ్య ఎక్కువగా పార్టీలో ఉన్న సినియర్ నేత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై అలాగే కేటీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా కేటీఆర్ ఉత్తమ్ కి ఒక సవాలును విసిరాడు.

మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయం సన్యాసం చేయడానికి నేను రెడీ కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరాడు. అయితే ఈ కౌంటర్లకు మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తుంది. ఒకవేళ అధికారంలోకి రాకుంటే ఉత్తమ్ తో పాటు తాను కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని వేంకటరెడ్డి ఛాలెంజ్ చేశారు. అంతే కాకుండా టీఆరెస్ పై ఆయన మరోసారి తన మాటలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మిషన్ భగీరథ, ఫైబర్ గ్రిడ్లలో ఉండే సగం కంపెనీలు మంత్రి కేటీఆర్‌ వేనని కామెంట్స్ చేశారు. మోడీ ని విమర్శిస్తే వారికీ జైలు తప్పదని కోమటి రెడ్డి విమర్శలు చేశారు.