కొణతాల రామ కృష్ణ పవన్ కళ్యాణ్ కోసం కష్టాలు ?

Friday, November 4th, 2016, 09:50:55 PM IST

konathala-ramakrishna
క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు కొణతాల రామకృష్ణ . ఆయన చాలా కాలం నుంచే వార్తల్లో ఎక్కడా కనపడ్డం లేదు కూడా. వైకాపా నుంచి బయటకి రావడం రావడమే టీడీపీ లోకి వెళుతున్నారు అనే వార్తలు వెలువడ్డాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. తాజాగా ప్రత్యేక హోదా అంటూ కొత్త జండా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈ నెల 9 న అనకాపల్లి లో చాయ్ చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించ బోతున్నారు. దీంతో ప్రత్యేక హోదా మీద ప్రజలలో అవగాహన కలిపించే పని పెట్టుకున్నారు ఆయన. టీ స్టాల్స్ ని చేరుకొని అక్కడ ఉన్న జనంతో ప్రత్యేక హోదా వలన కలిగే ఉపయోగాలు ఏంటి , అది రాకపోతే జోడయ్యే నష్టాలు ఎలా ఉంటాయి ఇలాంటి విషయాల మీద రామ కృష్ణ పొలిటికల్ గా మాట్లాడతారు అన్నమాట. రాజకీయంగా ఆయన తీసుకోబోయే కొత్త టర్నింగ్ కి ఇది మొదటి మెట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ కొణతాల ఏ పార్టీ తరఫున ఈ చర్చ చేపడుతున్నట్టు… ప్రభుత్వానికి (టీడీపీకి) వ్యతిరేకంగానా.. వైకాపాకి మద్దతుగానా.. లేక జనసేనకు తోడుగానా.. అదీగాక బీజేపీ నిర్ణయానికి ఖండనగానా… ఈ విషయాలు త్వరలోనే తేలబొతున్నాయి. అయితే… ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల ప్రకారం ఎవరైనా “ప్రత్యేక హోదా” అనే అంశం లేవనెత్తితే వారిపై అభివృద్ధి నిరోదకులని ముద్రవేసేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక ప్యాకేజీ గొప్పతనం గురించి తప్ప… హోదా అనే ప్రస్థావన తీసుకొస్తే… అటు టీడీపీ – ఇటు బీజేపీ నేతలనుంచి ఒక్కసారిగా ఫైరింగ్ ఆర్డర్స్ విడుదలవుతున్నాయి. ఖచ్చితంగా వైకాపా వైపే ఆయన మొగ్గు చూపుతారు అనీ లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీలో కూడా చేరే ఛాన్స్ ఉంది అనీ అంటున్నారు.