శ్రీరెడ్డి కి కోన వెంకట్ ఛాలెంజ్!

Friday, April 13th, 2018, 09:04:59 PM IST


ప్రస్తుతం నటి శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద ప్రకంపనలే సృష్టించిందని చెప్పాలి. కాస్టింగ్ కౌచ్ విషయంలో కొందరు తనను లైగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన ఆమె, అంతటితో ఆగకుండా సురేష్ బాబు తనయుడు అభిరాం, రచయిత కోన వెంకట్, ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, వైవా హర్ష, దర్శకుడు కొరటాల శివకు సంబంధించి తనతో వాళ్ళు చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆతరువాత ఆమె ఫిలిం ఛాంబర్ ముందు అర్ధ నాగం ప్రదర్శన చేయడం. దానితో ఆమెకు మా సభ్యత్వం ఇచ్చేది లేదని మా సంఘం తీర్మానించడం.

ఆ తరువాత పలు మీడియా చానెల్స్ కి వెళ్లిన ఆమెకు కొంత వరకు మద్దతు లభించడంతో మళ్లి నిన్న మా సంఘం ఆమెకు సభ్యత్వం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఈ తతంగం అంతా నిన్న జరిగిపోయింది. అయితే ఆమె బయటపెట్టిన పేర్లలో రచయిత కోనవెంకట్ పేరు ఒకటి. తనను బలవంతంగా శారీరకంగా కోన వెంకట్ లోబరచుకున్నాడని శ్రీరెడ్డి కామెంట్ చేసింది. ఈ విషయమై కోన వెంకట్ స్పందిస్తూ ‘ఓ నటి కొందరు సినిమా వాళ్లతో నా పేరు మీద కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసి షాక్ తిన్నాను. ఈ విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. నిజం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, తప్పక విజయం సాధిస్తుంది అని అన్నారు. అందుకే ఆమెపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను’ అని చెప్పాడు కోన వెంకట్.

తాను తెలుగు నటీనటులను ప్రోత్సహిస్తాననని, అందుకే గీతాంజలి మూవీలో అందరూ తెలుగు నటులనే తీసుకున్నానని చెప్పాడు . నేడు ప్రతిఒక్కరికీ సినిమా రంగం సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందని అభిప్రాయపడ్డాడు. తెలుగు ఆర్టిస్టులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడాన్ని తాను సపోర్ట్ చేస్తానన్నాడు కోన వెంకట్. అయితే ఇదివరకు తనతో కలిసి ఫోటోలు దిగినవాళ్లు చాలా మంది వున్నారని, మరి ఒకవేళ తనతో శ్రీరెడ్డి కి పరిచయమే ఉంటే తనతో కలిసి దిగిన ఫోటో ఒక్కటైనా బయటపెట్టాలని ఆయన ఛాలెంజ్ చేశారు. తాను శ్రీరెడ్డి తో కలిసి ఐదు నిమిషాలు మాట్లాడినట్లు ప్రూవ్ చేసినా తాను చట్టానికి లోబడి ఎటువంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు….