మాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు.. టీఆరెస్ పై కొండా ఆగ్రహం!

Saturday, September 8th, 2018, 01:52:07 PM IST

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 105 అభ్యర్థుల తొలి జాబితాపై సొంత పార్టీ నుంచే విమర్శలు మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ మీడియా ముందుకు వచ్చి టీఆరెస్ పార్టీలో ఉన్న తనకు అవమానం జరిగిందని అవమానం వ్యక్తం చేశారు. పార్టీకి అభివృద్ధికి తోడ్పడినప్పటికీ తమకు పార్టీ నుంచి టికెట్టు రాకపోవడం అన్యాయమని అన్నారు. కేవలం బిసి మహిళ అనే కారణంతోనే అవమానించారని ఇది కేవలం తనను మాత్రమే అవమానించడం కాదని రాష్ట్రంలో ఉన్న మొత్తం బిసిలని మహిళలని అవమానించినట్లు తెలిపారు.

ఇక తెలంగాణ కల్వకుంట్ల ఇల్లు కాదు. అది రాష్ట్రమని కొండా సురేఖ కేసీఆర్ పై పలు వ్యాఖ్యలు చేశారు. వరంగల్ లో 12 నియోజకవర్గాలలో 11 చోట్ల అభ్యర్థులను న్మిర్ణయించిన కేసీఆర్ తన సీటును మాత్రం ఎందుకు ప్రకటించలేదు. దానివెనుకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

2014 లో ఒంటరిగా పోటీ చేయాలనీ అనుకున్నప్పటికీ కేసీఆర్ గారే బ్రతిమాలి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. అదే విధంగా పార్టీలో ఉంటే తనకు మంత్రి పదవి, తన భర్త మురళీకి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని కేసీఆర్ తెలిపినట్లు వివరించారు. అయితే ఆ మాటను ఇప్పటివరకూ నిలబెట్టుకోలేదని తెలిపారు. ఇక వచ్చే ఎలక్షన్ లో భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్ లో తమ కుటుంబం పోటీ చేస్తుందని కొండ సురేఖ వివరణ ఇచ్చారు. ఫైనల్ గా కేసీఆర్ గారు తమకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనే దానిపై వివరణ ఇవ్వాలని ఆమె మీడియా ద్వారా కోరారు.

  •  
  •  
  •  
  •  

Comments