కేసిఆర్ పై పేలిన లేడీ గన్ !

Tuesday, September 25th, 2018, 09:51:46 PM IST

కేసిఆర్ ముఖ్యంమత్రి అయ్యాక ఆయన మీద స్థాయిలో విమర్శలు చేసిన అపోజిషన్ నాయకులు చాలా తక్కువే. ఏదో రేవంత్ లాంటి వాళ్ళు మినహా మిగిలిన వారంతా ఎప్పుడూ కేసిఆర్ లేదా కేటిఆర్ వేసిన కౌంటర్ల నుండి తమను తాము కాపాడుకోవడమే ఇన్నాళ్లు తెలంగాణాలో ఇతర నాయకులు చేసిన పని. అలాంటిది ఈరోజు ఏకంగా సొంత పార్టీ నేత కొండా సురేఖ కేసిఆర్ ను ఒక ఆట ఆడేసుకున్నారు.

పార్టీ అప్పజెప్పిన ప్రతి పనిని చిత్తశుద్ధితో చేశామన్న ఆమె ఏనాడూ తాము క్రమశిక్షణను మీరలేదని అలాంటిది తమకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. అంతేకాదు పదవి చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కేసిఆర్ చేసిన ప్రతి పనిని దుయ్యబట్టారు. పార్టీలో చేరే రోజునే తమకు ఆత్మాభినం ముఖ్యమని చెప్పినా ఈరోజు కేసిఆర్ ఆ ఆత్మాభినయం మీదే దెబ్బకొట్టారంటూ పెద్ద లేఖాస్త్రాన్ని సంధించారు.

అందులో మీ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడ లేదు, ఒక్కరోజు కూడా మీరు సెక్రటేరియట్ కు రాకుండా ఫామ్ హౌజ్ నుండే పాలన చేశారు, మీది సొంత నేతలకు సైతం అందుబాటులో ఉందని దొరల పాలన, అమరుల కుటుంబాలకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు, రాహుల్ ను జోకర్ అన్న మానవీయ విలువలు లేని నేత మీరు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని పేదల్ని మోసం చేశారు, కేటీఆర్ ఇందిరా గాంధీని తిట్టడం సరికాదు, ధనిక రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తారా, కాంట్రాక్టర్ల దగ్గర్నుండి ఎంత తిన్నారో లెక్క చెప్పండి అంటూ కోదండరాం విషయం, కోట్లు ఖర్చు పెట్టి చేసిన ప్రగతి నివేదన సభ గురించి, ఇలా అనేక అంశాల గురించి థౌసండ్ వాలాల పేలారామె. మరి తమ మీద పేలిన ఈ లేడీ గన్ కు కేసిఆర్, కేటిఆర్ ఎలా సమాధానమిస్తారో చూడాలి.