కొండగట్టు బాధితుల్ని మరింత బాధిస్తున్న కేసిఆర్ సర్కార్ !

Tuesday, October 9th, 2018, 12:30:09 PM IST

సెప్టెంబర్ 11న జరిగిన కొండగట్టు బస్సు దుర్ఘటన తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే అతి భాధాకరమైన ఘటన. ఈ ప్రమాదంలో 62మంది మృతి చెందడంతో ఎన్నో కుటుంబాలు ఆధారం లేకుండాపోయాయి. ప్రమాదానికి భాద్యత వహించాల్సిన ప్రభుత్వం ఎప్పటిలాగే బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది. దీంతో బాధితులు తమకు కనీస ఊరటైనా దక్కుతుందని అనుకున్నారు.

ఈ పరిహారంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం 3 లక్షలు ప్రకటించడంతో మొత్తం ఒక్కొక్క బాధిత కుటుంబానికి 8 లక్షలు పరిహారం అందాల్సి ఉంది. ఈ మేరకు కేసిఆర్ సర్కార్ అందరికీ చెక్కులు పంపిణీ చేసింది. బాధితులు ఆ చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళ్లగా సర్కార్ ఖాతాలో సరిపడినంత డబ్బు లేనందున చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి.

దీంతో బాధితులు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లగా అక్కడి అధికారులు కూడ సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ రోడ్డెక్కారు. చనిపోయినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడ తీరిక లేని ముఖ్యమంత్రి ఇప్పుడు డబ్బు ల్లేకుండా చెక్కులిచ్చి మరోసారి తమను చులకన చేశారని ఆవేదన వ్యక్యం చేస్తున్నారు బాధితులు. ఇలాంటి భాద్యతా రాహిత్యమైన చర్యలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికలో తెరాసా ఫలితాన్ని గట్టిగానే దెబ్బకొట్టే ప్రమాదం ఉంది.