ప్రొఫెసర్ ను పోటీ చేయనిస్తారా.. లేదా ?

Tuesday, October 9th, 2018, 08:00:53 PM IST

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత కేసిఆర్ పద్దతి నచ్చక తెలంగాణ జనసమితి పేరుతొ వేరు కుంపటి పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం రాబోయే ముందస్తు ఎన్నికల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐల మహాకూటమిలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తమకు 15 స్థానాల వరకు గెలిచే బలముందని 15 సీట్లు తమకు కేటాయించాలని మొదటి నుండి టిజెఎస్ పట్టుబడుతూ వస్తూ ఈ మధ్యే కొంత మెత్తబడి, ఆ సంఖ్యను తగ్గించుకుంది.

తాజాగా కూటమి పెద్దలందరూ కలిసి తెలంగాణ ప్రజలకు మంచి నమ్మకస్థుడైనందున ఆయన్ను కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయకుండా ఆయన చేత రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయించాలని భావిస్తున్నారట. అందుకోసం ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చనే ఊహాగానాలు కూడ వినిపిస్తున్నాయి.

అంతేగాక పార్టలన్నీ కలిసిన ఈ మహాకూటమికి తెలంగాణ పరిరక్షణ వేదిక అని పేరు పెట్టి దానికి ఆయన్నే చైర్మన్ ను చేయాలని చూస్తున్నాయట పార్టీలన్నీ. ఇలా పెద్ద భాద్యతలన్నీ కోదండరాం నెత్తిన పెట్టేసి ఆయన్ను ఏకంగా పోటీ కూడ చేయకుండా చేసేలా కనిపిస్త్యున్నారు మిగతా నేతలు. ఈ ప్రతిపాదన ఇప్పటికే కోదండరాం వద్దకు వెళ్లగా ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని తెలియజేయనున్నారు.