ప‌వ‌న్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయనున్న కొర‌టాల‌?

Monday, September 26th, 2016, 02:40:55 PM IST

pawan-koratala-siva
కొర‌టాల శివ ద‌గ్గ‌ర ప‌ది కథలు సిద్ధంగా ఉన్నాయ‌ట‌. కెరీర్లో అవి తెరకెక్కిస్తే చాలని, ఇంకేమీ అవసరం లేదని స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. అయితే ఆయ‌న కథల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్ర‌మే చేయాల్సినది ఒక‌టి ఉంద‌ట‌. ఆ క‌థ‌కి సంబంధించి పూర్తి స్థాయిలో స్క్రిప్టు సిద్ధ‌మ‌య్యాక వెళ్లి ప‌వ‌న్‌కి వినిపించ‌బోతున్నాడ‌ట‌. కొర‌టాల సినిమాలు మంచి సోష‌ల్ ఎలిమెంట్స్‌తో కూడుకొని ఉంటాయి. ఆ త‌ర‌హా స్క్రిప్టుని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లాంటి క‌థానాయ‌కుడు చేస్తే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీ మొత్తం ఈ కాంబినేష‌న్ గురించి ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తోంది. మ‌హేష్ కోసం ఇప్ప‌టికే స్క్రిప్టుని సిద్ధం చేసేసిన కొర‌టాల ఇప్పుడు వ‌ప‌న్ సినిమా గురించి సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

  •  
  •  
  •  
  •  

Comments