గ్యారేజ్ పై నిప్పులు చెరిగిన నటుడు కోట ?

Saturday, September 17th, 2016, 12:20:39 PM IST

kota-srinivas-rao
తెలుగు సినిమాల్లో తెలుగు నటులను తొక్కేస్తున్నారంటూ .. చాలా కాలంగా ఫైర్ అవుతున్న సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు మరోసారి ఫైర్ అయ్యారు ? తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ”జనతా గ్యారేజ్” సినిమా విషయంలో అయన మండిపడ్డాడు. ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే, ఆ సినిమాలో మోహన్ లాల్ బాగా చేశాడంటూ అందరు పొగిడేస్తున్నారు, ఈ విషయం పై అయన మాట్లాడుతూ .. ఈ మద్యే విడుదలైన ఓ సినిమాలో హీరో గురించి ఎవరు పొగడడం వినలేదు కానీ ఆ సినిమాలో మోహన్ లాల్ బాగా చేసాడు, అతను గ్రేట్ యాక్టర్ అంటూ మలయాళ యాక్టర్ మోహన్ లాల్ ని పొగిడేస్తున్నారు, అతన్ని నువ్వు సినిమాలో పెట్టుకుని అతనే బాగా చేసాడంటే ఎలా ? మరి తెలుగువాడు ఏమైపోయాడు? అది చుపించాకా తెలుగువాడు ఎంత యాక్ట్ చేస్తే నీకు అనతాడు అంటూ ప్రశ్నించారు కోట? ”పనైపోతుంది కదా అని వాళ్ళను పెట్టుకుంటే .. మిగిలిన వారు భోజనం చెయ్యక్కర్లేదా”? అంటూ సూటిగా ప్రశ్నించారు? అసలు దర్శకులు ఏమంటున్నారంటే .. ”ఆ రేంజ్ యాక్టింగ్ చేసే నటులు ఇక్కడ లేకపోవడంతోనే పరాయి బాషలనుండి అరువు తెచ్చుకుంటున్నాం” అంటూ సెలవిచ్చారు .. మరి కోట శ్రీనివాసరావ్ కామెంట్స్ పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి !!