ఎంపీ కొత్తప‌ల్లి గీత విష‌యంలో.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

Friday, January 11th, 2019, 12:30:19 PM IST

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ గుర్తు పై గెలిచిన ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత ఆ త‌ర్వాత అధికార టీడీపీలోకి వెళ్ళినా ఆ పార్టీలో ఉన్న టీడీపీ త‌మ్ముళ్లు ఆమెకు అంత సీన్ ఇవ్వ‌డంలేద‌ని తెలుస్తోంది. దీంతో అంద‌లం ఎక్కించిన పార్టీనే కాద‌ని, జంప్ అయిన కొత్త‌ప‌ల్లి గీత ఇప్పుడు తెగ బాధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఎందుకంటే వ‌చ్చే చంద్ర‌బాబు చేయించిన ఇన్న‌ర్ స‌ర్వేలో వైసీపీ నుండి ఫిరాయించిన వారికి నెగిటీవ్‌గా రిపోర్ట్ వ‌చ్చిందంట‌. దీంతో వారిలో ఇద్ద‌రు ముగ్గురు త‌ప్పిస్తే.. మిగ‌తా వారికి బాబు మొండిచెయ్యి చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో రాష్ట్రంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఆలోచ‌న‌లో ప‌డిన కొత్తప‌ల్లి గీత టీడీపీలోనే ఉంటే త‌న రాజ‌కీయ‌భ‌విష్య‌త్తు మొత్తం గంగ‌లో క‌లిసిపోతుంద‌ని, దీంతో ఆమె పార్టీలోకి మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. దీంతో గీత మ‌ళ్ళీ వైసీపీలో చేరేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వైసీపీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చించార‌ని, ఆ విష‌యం జ‌గ‌న్ వ‌ద్ద‌కు కూడా వెళ్ళ‌డంతో, ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా, కొత్త‌ప‌ల్లి గీత‌ను మ‌రోసారి పార్టీలో చేర్చుకునే అవ‌కాశంలేద‌ని తేల్చిచెప్పార‌ని స‌మాచారం. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త లేని వారికి వైసీపీలో చోటు లేద‌ని, త‌నకు ప్ర‌జ‌ల పై న‌మ్మ‌కం ఉంద‌ని, ప్ర‌జ‌ల‌కు కూడా త‌న పై న‌మ్మ‌కం ఉంద‌ని, దాన్ని తాను పోగొట్టుకోవ‌డానికి తాను సిద్ధంగా లేన‌ని జ‌గ‌న్ ఫైనల్‌గా తేల్చేశారిని తెలుస్తోంది. దీంతో ఈ విష‌యం తెలుసుకుని షాక్ తిన్న కొత్త‌ప‌ల్లి గీత, ఇప్పుడు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.