కౌశల్ ఆర్మీకి అంత సీన్ లేదంటున్న నాని..!

Wednesday, September 26th, 2018, 02:00:37 PM IST


బిగ్ బాస్ షోతో కేవలం వెండి తెరకు మాత్రమే కాకుండా బుల్లి తెరకు కూడా నాచురల్ స్టార్ నాని సుపరిచితం అయ్యిపోయాడు.షో మొదలయ్యిన కొత్తలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంత కాకపోయినా తన స్టైల్లో నెట్టుకొచ్చేసాడు,పరవాలేదు అన్న స్థాయి నుంచి నాని కూడా బాగానే సెట్ అయ్యాడు అన్న స్థాయికి తన పవర్ చూపించాడు నాని.కానీ బిగ్ బాస్ షోలో ప్రతీ సారీ కౌశల్ ని టార్గెట్ చెయ్యడం పట్ల ట్విట్టర్లో ఎన్నో సార్లు అవమానం పాలయ్యాడు,నాని బిగ్ బాస్ షోకి సరిపోలేదని కౌశల్ యొక్క అభిమానులు ట్విట్టర్లో “కౌశల్ ఆర్మీ” పేరిట ట్రెండింగ్ కూడా చేసి పారేశారు.ఇప్పుడు మళ్ళీ వీరి వైరం ఇంకా ముదరనుంది అన్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

ఇప్పటికే నాని మీద కౌశల్ ఆర్మీ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు.అదే స్థాయి కోపంతో ఇప్పుడు కింగ్ నాగార్జున మరియు నాని మల్టీస్టారర్ గా నటించిన “దేవదాస్” చిత్రాన్ని తాము బోయికాట్ చేస్తున్నామని పేర్కొన్నారు,ఈ విషయం పై నాని స్పందన ఏమిటి అని అడగగా “కౌశల్ ఆర్మీ”కి అంత సీన్ లేదని సింపుల్ గా తీసి పారేశారు.ఎంతో మంది కలిసి కస్టపడి తీసిన చిత్రాన్ని కేవలం ఒక్కడి కోసం ఆగదని సినిమా విడుదల పట్ల ఎలాంటి సందేహం లేదని ఖచ్చితంగా సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు.