బిగ్ బాస్ లో కౌశల్ ని గెలిపించింది కౌశల్ ఆర్మీ కాదు..మరెవరు?

Monday, October 1st, 2018, 09:36:17 PM IST


బిగ్ బాస్ రెండో సీసన్ కు నిన్నటితో తెర పడింది.అత్యంత ఉత్కంఠ పరిస్థితుల్లో కౌశల్ బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్నారు.కౌశల్ ని గెలిపించింది ప్రత్యక్షంగా ఆయన అభిమానులు అయినా సరే పరోక్షంగా గెలిపించింది,గెలవడానికి కారణం మాత్రం వేరే వ్యక్తులున్నారని కౌశల్ అభిమానులే అంటున్నారు.ఈ షో మొదలయ్యినప్పటి నుంచి కౌశల్ తనదైన శైలిలో తన ఆటని నిజాయితీగా నిక్కచ్చిగా ఆడేవాడు,దానితో ఒక్క నూతన నాయుడుతో తప్ప మిగతా వాళ్లందరికీ విరోధి అయ్యిపోయాడు,దీనితో వారందరు కౌశల్ ని తప్పుబట్టడం మొదలు పెట్టారు.కానీ కౌశల్ మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుకూలంగానే ఎప్పుడు నడుచుకున్నాడు,దీనితో ప్రేక్షకుల్లో ఆకర్షితుడయ్యాడు.అశేషమైన ప్రజాదరణ పొందాడు.దీనితో కౌశల్ ఆర్మీ అనే ఒక సైన్యం కౌశల్ ని వ్యతిరేకిస్తున్న వారి వల్లనే ఏర్పడింది.వారు అందరు తనకి వ్యతిరేకంగా ఉన్నా మేము ఉన్నాం అంటూ చివరి వరకు కౌశల్ కి అండగా అతని అభిమానులున్నారు,దానితో చివరి వరకు వచ్చి టైటిల్ ని కైవసం చేసుకున్నాడు.కౌశల్ గెలుపుకి కారణం ప్రత్యక్షంగా తాము అయినా పరోక్షంగా మాత్రం మిగతా హౌస్ మేట్స్ అని కౌశల్ అభిమానులు చెప్పుకుంటున్నారు.