బిగ్ బాస్ : చిన్న సీరియల్ ఆర్టిస్టే.. ‘స్టార్ మా’కి దేవుడయ్యాడు!

Saturday, September 15th, 2018, 04:40:41 PM IST

ఏదైనా జరగచ్చు అని నాని చెప్పిన మాటకు తగ్గట్టుగానే ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పరిస్థితులు నెలకొన్నాయి. మొదట్లో ఎదో నామమాత్రం అన్నట్టుగా షోపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అన్నట్టుగా షో స్థాయి పెరిగిపోతోంది. అయితే బిగ్ బాస్ సెకండ్ సీజన్ పై అందరు ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం కౌశల్. మనోడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు. గతంలో బిగ్ బాస్ ద్వారా ఏ సెలబ్రెటికి లేనంత ఫెమ్ వచ్చేసింది.

హౌస్ లో ఎంత మంది కంటెస్టెంట్ లు ఉన్నా కూడా అందరి చూపు కౌశల్ వైపే. ముందు నుంచి మంచి స్టార్ హోదా లో ఉన్న సెలబ్రెటీలు కంటే కూడా కౌశల్ కు ఎక్కువగా ఆధారణ దక్కుతోంది. మొన్నటి వరకు కౌశల్ అంటే కేవలం సీరియల్స్ లో కనిపించే చిన్న నటుడు. చాలా తక్కువ పారితోషికం అందుకునే నటుడు. కానీ ఇప్పుడు స్టార్ మాకు అలాంటి వ్యక్తే మంచి రేటింగ్ తెప్పించడానికి ఉపయోగపడుతున్నాడు. అతడే రేటింగ్ దేవుడయ్యాడు. బిగ్ బాస్ కు సాధారణ రోజుల్లో కూడా మంచి రేటింగ్ వస్తోంది అంటే అది కౌశల్ వల్లే.

అందరూ ఒకవైపు ఉంటే తాను ఒక్కడు ఒక వైపు ఉన్నాడు. ఎలిమినేషన్ కి ఎవరు నామినేట్ చేసినా కూడా అభిమానుల అండతో గట్టిగా నిలబడ్డాడు. ఎవరు ఎన్ని వేత్తులు వేసినా కూడా కౌశల్ తనదైన శైలిలో పరిగెడుతూన్నాడు. మరోవైపు కౌశల్ ఆర్మీ బలం కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ వారం ఎలిమినేషన్ కీలకం కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

  •  
  •  
  •  
  •  

Comments