బిగ్ బాస్2 తెలుగు టైటిల్ కౌశల్ సొంతం అంటున్న అమిత్..!

Wednesday, September 19th, 2018, 07:55:18 PM IST

బిగ్ బాస్ షో ఈ షో కోసం మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే బాలీవుడ్ లోను కోలీవుడ్ లోను విజయవంతంగా దూసుకుపోతూ కాస్త లేటు గానే మన తెలుగులోకి అరంగేట్రం అయ్యింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అంటూ మొదటి సీజన్ లోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్ తోనే హోస్టింగ్ చేయించింది.అదే విధంగా రెండో సీజన్ కోసం కూడా ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా చూసారు.అది కూడా నాచురల్ స్టార్ నాని తో మొదలయ్యింది కానీ ముందు సీజన్ అంతలా మెప్పించలేకపోయింది అని కొంత మంది నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఐతే ఇదే సమయంలో ఈ షోలో ఉన్నటువంటి పోటీదారుల్లో కౌశల్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఈ పోటీదారునికి నేను చూడలేదని ఇటీవలే షో నుంచి వైదొలిగిన అమిత్ తివారి పేర్కొన్నారు.

బిగ్ బాస్ 2 మొదలయ్యిన దగ్గర నుంచి ఎన్నో వివాదాల నడుమ మొదలయ్యింది.కానీ అందరి పోటీదారుల్లో కౌశల్ మాత్రం భిన్నంగా ఉండేవాడు తన అభిప్రాయం ఏదైనా సూటిగా తెలియజేసేవాడు,అతని నిజాయితీ ఆట తీరు చూసి “కౌశల్ ఆర్మీ” అనే పేరుతో ఒక మినీ సైన్యం కూడా తయారయ్యింది.దీనిపై అమిత్ మాట్లాడుతూ నేను బయటకి వచ్చిన తర్వాత కౌశల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యానని తెలిపారు.దీనికి కారణం అతని ఆట తీరు వ్యక్తిత్వమే అయ్యి ఉంటుందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థుల్లో కౌశల్ కి ప్రేక్షకుల్లో అశేషమైన ఆదరణ ఉంది అని ఈ ఆదరణ చూసి బిగ్ బాస్ 2 టైటిల్ కౌశల్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.అంతే కాకుండా గీతా మాధురికి కూడా సపోర్ట్ బాగానే ఉంది అని పోటీ ఉంటే వీరిద్దరి మధ్య ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.