గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకోబోతున్న కౌశల్..!

Friday, October 5th, 2018, 07:39:42 PM IST

బిగ్ బాస్ షో అనే ఒకే ఒక్క రియాలిటీ షో తో తనదైన శైలిలో ఆడుతూ ఎక్కడా బెణకకుండా,నిజాయితీగా తన స్వభావంతో ప్రేక్షకుల హృదయాలతో పాటు బిగ్ బాస్ 2 సీసన్ టైటిల్ ని కూడా కౌశల్ గెలుచుకున్నాడు.అంతే కాకుండా అదే బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరికి దక్కనటువంటి ఊహించని స్థాయిలో అభిమాన జనాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు కౌశల్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్నాడు అని సోషల్ మీడియాలో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మనం వేరే చెప్పక్కర్లేదు.అందుకు నిదర్శనంగా తనతో ఫైనల్స్ కు చేరుకున్న గీత మాధురిని కొన్ని కోట్ల ఓట్ల తేడాతో ఓడించాడు.ఇప్పుడు ఆ ఓట్లే కౌశల్ కు ఒక అరుదైన గౌరవాన్ని అందించబోతున్నాయి.ఇటీవలే కౌశల్ తనని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు సంప్రదించారని,ఇది వరకే కౌశల్ తెలిపారు.తనకి బుల్లి తెర షో లలో ఎవ్వరికి రాని భారీ స్థాయిలో ఓట్లు రావడం పట్ల గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కౌశల్ పేరును వారి గిన్నీస్ రికార్డ్స్ లో చేర్చబోతున్నారని,కౌశల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసారని అతని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments