ఆ పార్కులో ఇక నుంచి ఆ పనులు చేస్తే అంతే !

Monday, January 29th, 2018, 04:50:45 PM IST

ప్రస్తుత రోజుల్లో ఫ్యామిలీలతో కొన్ని పార్కులకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంత మంది పొదల చాటున శృంగార కార్యకలాపాలు నడిపిస్తుండడంతో బూతు పార్కులను తలపిస్తున్నట్లు సోషల్ మీడియాలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా ఇబ్బంది కలిగించే కార్యకలాపాలు జరగకూడదని కోయంబ‌త్తూర్‌లోని అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ బొటానిక‌ల్ గార్డెన్స్ కొత్త రూల్ ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి పార్క్ లో ఎవరైనా అడుగుపెట్టాలంటే తప్పకుండా వివాహ ధ్రువీకరణ పత్రం చూపించాలని. అలా అయితేనే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని పార్క్ అధికారులు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్క్ పై పిర్యాదులు చాలా ఎక్కువగా వస్తుండడంతో యాజమాన్యం ఈ తరహా రూల్ ని తీసుకువచ్చింది. పార్క్ లో ప్రవేశించిన తరువాత ఎప్పుడు అడిగినా మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాలని అలాగే శృంగార కార్యకలాపాలను జరిపితే చర్యలు తీసుకుంటామని లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని తెలిపారు.