తెలంగాణ లోగో వద్దా సానియా..?

Saturday, September 13th, 2014, 12:15:12 PM IST

saniya
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యూఎస్ ఓపెన్ లో డబుల్స్ సాధించడంతో అంతా ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు ఇంతకు ముందే నజరానా దక్కించుకుంది.. దానికి బోనస్ గా రీసెంట్ గా మరో కోటి రూపాయలూ ఆమె ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం వేసేసింది.. ఐతే ఇంత చేసినా కొంతమంది ఇంకా సానియాగా గుస్సా చేస్తున్నారు. ఎందుకంటే బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితురాలైన టెన్నిస్ సానియా మీర్జా తెలంగాణ లోగోను ఎందుకు ధరించడం లేదు.

లోగో ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడుంటే తెలంగాణ బ్రాండ్‌ విశ్వవ్యాప్తంగా విస్తరించేది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. సర్కారు ఔదార్యాన్ని కోట్ల రూపాయల్లో స్వీకరించిన ఈ క్రీడాకారిణికి లోగో ధరించాలనే నిబంధనను తెలంగాణా సర్కారు పెట్టలేదా? లేక సానియా నిరాకరించిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర క్రీడా పాలసీలు వస్తేనే ఇలాంటి పొరబాట్లను సవరించే వీలుంటుందని క్రీడా సంఘ బాధ్యుడు కె.పి.రావు అన్నారు. యూఎస్ ఓపెన్ లో తెలంగాణ లోగో ధరించకుండా సానియా ఆడడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి సాయం పొందినప్పుడు ఎందుకు లోగో ధరించలేదనేది ఆయన ప్రశ్న.