కోహ్లీకి ఇంస్టాగ్రామ్ అవార్డు ఇచ్చిందోచ్…

Saturday, March 31st, 2018, 05:55:06 PM IST

క్రికేట్ రంగంలోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. భారత్‌లో 2017లో సోషల్ మీడియా నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ఎంగేజ్డ్ అకౌంట్‌లో ఉన్న ఇంస్టాగ్రామ్ ఖాతాదారులలో కోహ్లీ ముందంజలో ఉన్నాడు, ఈ సందర్భంగా అతనికి ఇంస్టాగ్రామ్ అవార్డు లభించింది. విరాట్ అవార్డుతో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో పాటు అతన్ని ఫాలో అవుతున్న అభిమానులదరికీ ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ అవార్డును ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, ప్రేమను పంచిన అభిమానులకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు. ఇది మీ వల్లే వచ్చింది. నేను ఎప్పుడూ సరైన పనులు చేసేందుకు ప్రేరణగా నా వెనక మీ అభిమానులు నిలిచారని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని 20.1 మిలియన్ల మంది ఫాలోఅవుతున్నారు. కొన్నేళ్ల నుంచి విరాట్ సోషల్‌మీడియాలో తరచూ స్పందిస్తూ.. తన వ్యక్తిగత, క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల్లో లీగ్ ఆరంభంకానున్న నేపథ్యంలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాడు.