వీడియో : టిఆర్ఎస్ కాదు..జనసేన కాదు..మా దారి మాదే..!

Sunday, January 28th, 2018, 06:36:59 PM IST

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఆర్ కృష్ణయ్య ఈ సారి సొంత దారి వెతుక్కునే అవకాశం కనిపిస్తోంది. గత కొంత కాలంగా అయన టీడీపీకి కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం లేదు. బిసి సంఘం నాయకుడిగా పాపులర్ అయిన ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టె ఆలోచనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో కృష్ణయ్య తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాలకు రాజకీయ పార్టీలు ఉన్నాయని కృష్ణయ్య అన్నారు. కానీ బిసిలకు మాత్రం ఎటువంటి రాజకీయ పార్టీ లేదని తెలిపారు. బిసిల కోసం అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వాలనుంచి ఫలితాలు రాబట్టిన తనకు అట్టడుగు గ్రామాల నుంచి సైతం బిసిలకంటూ సొంత పార్టీ పెట్టాలని వత్తిడి వస్తోందని వివరించారు. అది కేవలం ప్రజా భిష్టం మాత్రమే అని, టిఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకొవాలా, జనసేన తో పొత్తు పెట్టుకోవాలా అనే అంశాలపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని కృష్ణయ్య అన్నారు. చట్టసభలలో బిసిలకు రిజర్వేషన్లు సాధించేలా పోరాటం చేయడమే తన అభిమతం అని కృష్ణయ్య అన్నారు.