ప్రీమియర్ షో టాక్ : కృష్ణార్జున యుద్ధం ఎలా ఉందంటే?

Thursday, April 12th, 2018, 11:58:29 AM IST

గత కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతోన్న నాని మరోసారి కెరీర్ లో కొత్త విజయాన్ని నమోదు చేయాలనీ డ్యూయెల్ లో నటించిన కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎక్కువగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనుపమ – రుఖ్సర్ కథానాయికలు. అయితే సినిమా ప్రీమియర్ షోను అమెరికాలో కొద్దీ సేపటి క్రితం ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం.

దర్శకుడు మేర్లపాక గాంధీ గతంలో తెరక్కేకించిన కథలకు కొంచెం డిఫెరెంట్ గా ఈ సినిమా నడుస్తుంది. రెండు విభిన్న కథానాయకుడి పాత్రలను దర్శకుడు బ్యాలెన్స్ చేసుకుంటూ నడిపించాడు. ముఖ్యంగా నాని.. అర్జున్ – కృష్ణ పాత్రల్లో ఒదిగిపోయాడు. చిత్తూరు – యూరప్ నేపథ్యంలో కథ చాలా సరదగా సాగుతుంది. కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా కొంచెం రొటీన్ గా అనిపించినప్పటికీ కమర్షియల్ ఆడియెన్స్ కి నచ్చే అవకాశం ఉంది. లవ్ సీన్స్ లో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బావుండు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కథానాయకులు ప్రేమలో పడతారు. ఆ తరువాత వారి నుంచి హీరోయిన్స్ దూరమవ్వడం. వారిని కలవడానికి హీరోలు ప్రయత్నాలు చేస్తుంటారు. స్క్రీన్ ప్లే సినిమాలో ప్రధాన బాలంగా అనిపిస్తుంది. కథానాయికలను వెతికే పనిలో హీరోలు ఒకటవ్వడం కూడా జరుగుతుంది. అందుకు సంబందించిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ సినిమాకి ప్లస్ పాయింట్. సెకండ్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది అని అనిపిస్తుంటుంది. మొత్తంగా సినిమా నాని ఫ్యాన్స్ కు నచ్చుతుంది.అయితే నాని నుంచి కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు.