ముందస్తు ఎన్నికలకు మేము రెడీ : కేటీఆర్

Sunday, September 2nd, 2018, 03:00:04 PM IST

తెలంగాణాలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడనుందని టీఆరెస్ నేతల మాటల నుంచి సిగ్నల్స్ అందుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిన సమయం వస్తోందని కూడా ఇతర పార్టీల నేతలు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నేతల అభిప్రాయం మాత్రం ఈ విషయంలో బిన్నంగా ఉంది. ఇక రీసెంట్ గా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల పై అభిప్రాయాన్ని తెలియజేశారు.

ముందస్తు ఎన్నికలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాము. ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసే బాధ్యతలను మా అధినేత కేసీఆర్ చూసుకుంటారు. ఇక బారి సభను నిర్వహించడంతో పాటు ఒకే రోజున కేబినెట్ సమావేశం కూడా నిర్వహించడం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనమని తెలియజేశారు. అదే విధంగా కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు కనీసం 25 వేల మంది కూడా రాలేదు. ఇప్పుడు టీఆరెస్ సభకు 46 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. బీరు బిర్యానీ ఇచ్చి ప్రజలను తరలించడం కాంగ్రెస్ పార్టీ నైజమని కేటీఆర్ మండిపడ్డారు. ఇక ముందస్తు ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ భయపడుతోందని ఎన్నికలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతామని ఆ పార్టీ నాయకులూ చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శమని కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

  •  
  •  
  •  
  •  

Comments