యాదాద్రి దారుణ ఘటనలపై కేటీఆర్, కవిత స్పందించాలి….!

Monday, August 6th, 2018, 06:18:52 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రాన్ని ఎందరో త్యాగధనుల ఫలితంగా సాధించామని, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే తన ధ్యేమని ఎప్పుడు చెపుతుంటారు కదా, మరి అటువంటి కేసీఆర్ గత మూడురోజులుగా యాదాద్రిలో చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాలగురించి ఎందుకు స్పందించడంలేదని తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి కొల్లి మాధవి ప్రశ్నించారు. నేడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు అయన పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదో మేము సాయం చేస్తున్నాం అంటూ ఎవరైనా ఆపరేషన్ వుందనో, ఇంకేదైనా ఉంటేనో తాను ఎప్పుడు సాయం చేయడానికి ముందు వుంటాను అని చెప్పే కేటీఆర్ వారికీ ట్విట్టర్ ద్వారా సమాధానాలు కూడా ఇస్తుంటారు. మరి అలంటి వ్యక్తి చిన్నపిల్లపై జరుగుతున్న ఈ క్రూర చర్యలపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. యాదాద్రిలో పిల్లలను బలవంతంగా హింసించడమే కాకుండా,

వారు వయసులో త్వరగా ఎదిగేందుకు హార్మోనుల ఇంజక్షన్లు ఇస్తున్న దారుణ ఘటనలు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాదు అక్కడ పిల్లలు కూడా తరచు మాయం అవుతున్నారని, దానిపై కూడా వారు విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏమిటంటే అక్కడి మహిళా ఎమ్యెల్యే ఈ ఘటనలపై ఇప్పటివరకు నోరువిప్పకపోవడం శోచనీయమని, అందరికి మేము సాయం అందిస్తామని చెప్పే కవిత ఎందుకు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారని అన్నారు. పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తే ఆదుకోవలసిన శిశు సంక్షేమ సఖ కూడా ఎందుకు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, చిన్నారులకు ఏమిజరిగినా చూసుకోవలసిన బాధ్యత వారిది కాదా, ఇంత దారుణం జరుగుతుంటే వారు కూడా నిద్రపోతున్నారా అంటూ మండిపడ్డారు. ఈ దుర్ఘటనలపై తక్షణమే హై కోర్ట్ లో ఒక వ్యాజ్యం వేసి ఇప్పటివరకు ఎంతమంది పిల్లలు తప్పిపోయారో తెలుసుకుని, అక్కడి స్థానికుల ఇళ్లలో సోదాలు నిర్వహించాలని ఆమె అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments