తప్పుడు ట్వీట్ తో బుక్ అయిన బీజేపీ : షాకిచ్చిన కేటీఆర్…!!!

Sunday, July 29th, 2018, 04:59:46 PM IST

భారతీయ జనతా పార్టీపై ఇప్పటికే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఓవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో కూడా ఆ పార్టీ తప్పుడు చర్యలతో వున్న పేరుని చెడకొట్టుకుంటోంది అనే అపఖ్యాతిని మూటగట్టుకుంటోంది. విషయంలోకి వెళితే ఐటి, మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకగవర్గంలోని వీర్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలను మరింత ఆకర్షించడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను ఉపయోగించి ఆ పాఠశాలను రైల్వే కోచ్ ల మాదిరిగా తరగతి గదులకు రంగులు,

మరియు రైళ్లలో సీట్ల మాదిరి విద్యార్థుల బల్లలను రంగులతో అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అయితే ఆ పాఠశాల ఫోటోలను నేడు మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. కాగా ఆఫొటోలను తెలంగాణ బీజేపీ, అవి సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్)నిధులు అనుకుని, సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే వారినిధులతో ఆధునీకరించబడిన పాఠశాల అంటూ వాటినే బీజేపీ తెలంగాణ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ ను చూసిన మంత్రి కేటీఆర్, మీ హాస్యం బాగుంది, ఆ పాఠశాలను ఆధునీకరించింది ఎస్సీఆర్ నిధులతో కాదు, సీఎస్ఆర్ నిధులతో, దాని క్రెడిట్ మీకు చెందదు అంటూ ట్వీట్ చేశారు. కాగా బీజేపీ చేసిన ఆ తప్పుడు ట్వీట్ పై కొందరు నెటిజన్లు ఆగహం వ్యక్తం చేయడంతో వెంటనే వాళ్ళు తమ ఖాతా నుండి ఆ ట్వీట్ ను తీసివేయడం జరిగింది…

  •  
  •  
  •  
  •  

Comments