నా కొడుకును కూడా వదలట్లేదు.. కేటీఆర్ ఆవేదన!

Saturday, September 15th, 2018, 09:40:33 AM IST

ముందస్తు ఎన్నికలంటూ దేశాన్ని మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న టీఆరెస్ పార్టీ ప్రస్తుతం గెలుపే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇక మిగిలింది ప్రచారమే. బలంగా ఉన్న పార్టీని మరింత బలం చేకూర్చాలని చాలా కష్టపడుతున్నారు. ఇకపోతే ఓ వైపు వ్యూహాలను రచిస్తునే మరోవైపు ప్రతిపక్షలు చేసే విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఎక్కువగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్లు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

తనను విమర్శించడానికి ఎలాంటి అవకాశం దొరక్కపోవడంతో తన కొడుకును లాగుతున్నారని అన్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి స్పందించారు. ముఖ్యమంత్రి ఫ్యామిలిలో చిన్న పిల్లాడిని కూడా ప్రతిపక్షాలు వదలడం లేదని తెలిపారు. నా కొడుకు 13 ఏళ్ల వయసున్న పిల్లడు. అతను ఏం తప్పు చేశాడు. అభం శుభం తెలియని అతడి శరీర ఆకృతిపై ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విమర్శలు చూసిన తరువాత రాజకీయాల్లో ఉండడం అవసరమా అని అనిపించిందన్నారు. విక్తిగతంగా విషం చిమ్ముతుంటే బాధగా ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు రాజకీయాలు గురించి మరోసారి ఆలోచించుకోవాలని మనసులో అనిపిస్తోందని కేటీఆర్ వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments