ఆంధ్రలో కూడా పార్టీ పెట్టమంటున్నారు: కేటీఆర్

Saturday, May 26th, 2018, 08:49:04 PM IST


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ పార్టీ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో నేతలంతా పార్టీని ఇంకా బలంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా వెనుకబడి ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ ఓ వైపు కేసీఆర్ మరోవైపు మంత్రులు అధికారులను ఆదేశిస్తున్నారు. మీటింగ్ లను కూడా కొనసాగిస్తూ పార్టీ చేసిన విషయాలను గురించి జనాలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఐటి మంత్రి కేటీఆర్ కూడా తన మాటలతో జనాలను ఆకర్షిస్తున్నారు.

ప్రస్తుతం టీఆరెస్ పాలనలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా టీఆరెస్ పార్టీని కోరుకుంటున్నట్లు చెప్పారు. నల్గొండకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు ఈ రోజు కేసీఆర్ సమక్షంలో టీఆరెస్ లోకి చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి లో దూసుకుపోతోంది. పక్క రాష్ట్రాల వారు కూడా మా దగ్గరికి రండి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే కేసీఆర్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేస్తున్నారని పార్టీని అక్కడ కూడా స్థాపించాలని చెబుతున్నారని కేటీఆర్ మాట్లాడారు. అదే విధంగా మహారాష్ట్ర బార్డర్ లోని 40 గ్రామాలకు పైగా ప్రజలు వారి గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలనీ కోరుకుంటున్నట్లు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments