కేటీఆర్ నిజంగా గ్రేట్..అక్కడ తొలిసారిగా..

Wednesday, January 24th, 2018, 08:47:09 AM IST

తెలంగాణ పాలిటిక్స్ లో ఎటువంటి ప్రశ్నలకైనా విమర్శలకైనా ధీటుగా సమాధానం ఇచ్చే వారిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకరు. ఆయన ఆలోచనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఎక్కడ తగ్గాలో ఎక్కడ అధికారాన్ని చూపించాలో తెలిసిన అసలైన రాజకీయ నాయకుడిగా కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. గత నెల గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకాతో వేదికపై ఆయనా చర్చలు జరపడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఆంధ్రా ప్రజలు కూడా కేటీఆర్ మాటలకూ చాలా ఆకర్షితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన ఈ మూడేళ్లలో చాలా అభివృద్ధి చెందింది అని మోడీ తో పాటు ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే రీసెంట్ గా కేటీఆర్ దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తొలిసారి కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అలాగే వ్యాపారానుకూల వాతావరణాన్ని ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఇక సమావేశం అనంతరం ప్రపంచంలో ఉన్న ప్రముఖ కంపెనీల సిఈఓలను ఆయాన ప్రత్యేకంగా కలిశారు. ముఖ్యంగా ఇండోరమా వెంచర్స్ చైర్మన్ అలోక్ లోహియాతో టెక్స్ టైల్ పరిశ్రమలకు తెలంగాణ లో ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో వాటి గురి తెలుపుతూ..వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ గురించి వివరించారు. దేశంలోనే అతి పెద్ద పార్క్ అని కొరియా దేశం నుంచి ఈ పార్కులో పెట్టుబడులు పెడుతున్నారని అలాగే ఇండోరమా కూడా ముందుకు రావాలని కేటీఆర్ తెలిపారు.